వ్యాన్‌తో ప్రపంచం చుట్టేస్తున్న ఇండియన్ కపుల్.. వీరి ట్రావెల్ గోల్స్ చాలా స్పెషల్..!

స్మృతి భదౌరియా, కార్తీక్ వాసన్( Smriti Bhadauria, Kartik Vasan ) దంపతులు ట్రావెల్ బాగా ఇష్టపడతారు.ఆఫీసులో పని చేస్తూ, ఒకే చోట ఉంటూ సాధారణ జీవితాన్ని గడపాలని వారికి ఎప్పుడూ ఆశ కలగలేదు.

 An Indian Couple Traveling The World With A Van.. Their Travel Goals Are Very S-TeluguStop.com

ప్రపంచాన్ని చూడాలని, కొత్త అనుభవాలను పొందాలని బాగా తపనపడ్డారు.ఆ కలలను నిజం చేసుకునేందుకు వారు ఒక వ్యాన్‌ని కొనుగోలు చేశారు, అదే వాహనంలో ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికా వరకు రెండు ఖండాల మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వారు తమ ప్రయాణ కథనాలు, చిత్రాలను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, బ్రౌన్ వ్యాన్‌లైఫ్‌ (@thebrownvanlife)లో పంచుకున్నారు.వారు వారి సాహసోపేత, సంచార జీవనశైలి వల్ల చాలా పాపులర్ కూడా అయ్యారు.

షారుఖ్ ఖాన్ బాలీవుడ్ చిత్రం “స్వదేస్” చూశాక వ్యాన్‌లో జీవించాలనే ఆలోచన వచ్చిందని వారు చెప్పారు.ఈ సినిమాలో షారుఖ్ మోటర్‌హోమ్‌లో ప్రయాణిస్తాడు.

స్మృతి, కార్తీక్ ఉద్యోగాలు రిమోట్‌గా పని చేయడానికి అనుమతించినందున వారు సంపాదిస్తూనే ప్రయాణం చేస్తున్నారు.2020 లో వివాహం చేసుకున్న ఈ జంట కెనడాలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.ఆపై పాన్-అమెరికన్ హైవేపై ప్రయాణించారు, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి.ఇది 15 దేశాల గుండా వెళుతుంది, 30,000 కి.మీ దూరం ఉంటుంది.ఈ దారి పొడవునా విభిన్న ప్రాంతాలు, మనుషులు, సంస్కృతులను చూడాలనుకున్నారు.

కోవిడ్ 19 మహమ్మారి( COVID-19 challenges ) కారణంగా వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.రద్దీగా ఉండే నగరాలను దాట వేస్తూ, ప్రతి సరిహద్దు వద్ద టెస్ట్ చేయించుకుంటూ ముందుకు సాగారు.వారితో పాటు ప్రయాణించిన తమ రెండు కుక్కలను కూడా వారు జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది.2021, ఏప్రిల్‌లో మెక్సికోకు చేరుకున్నారు, 2022, మార్చిలో పనామా చేరుకునే వరకు దక్షిణ దిశగా కొనసాగారు.

వారు పర్యటనలో చాలా అందమైన, ఆసక్తికరమైన విషయాలను ఆస్వాదించారు.సొంత భారతీయ సంస్కృతిని గుర్తుచేసే లాటిన్ అమెరికన్ ప్రజలతో కూడా వారు అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.అయితే వ్యాన్‌లో ఎక్కువ కాలం జీవించడం అంత సులభం కాదు.వాళ్లు అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.ప్రతి రాత్రి నిద్రించడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనవలసి వచ్చింది.నీరు, విద్యుత్తును ఆదా చేయాలి.

తమ ఆహారాన్ని చిన్న ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలి.తమ పనిని, ప్రయాణ సమయాన్ని కూడా సమతుల్యం చేసుకోవాలి.2023, డిసెంబర్‌లో అర్జెంటీనా( Argentina )లోని ఉషుయాలో తమ ప్రయాణాన్ని ముగించారు.వారు పెద్ద మోటర్‌హోమ్‌ను నిర్మించి, ఆసియా, యూరప్ వంటి ఇతర ఖండాలకు వెళ్లాలనుకుంటున్నారు.

ఇండియాలో ఉన్న తమ కుటుంబాన్ని చూసి కాసేపు రిలాక్స్ అవ్వాలని కూడా ఎదురు చూస్తున్నారు.ఈ జంట నెక్స్ట్ డెస్టినేషన్ అంటార్కిటికా, అక్కడ వారు పడవలో వెళతారు.

ఆ తరువాత, సిల్క్ రూట్‌ను అనుసరించి యూరప్‌ను అన్వేషించాలని ప్లాన్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube