తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన శంకర్( Shankar ) ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే దీనికి ముందే ఆయన భారతీయుడు 2 ( Indian 2 )అనే సినిమా స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా స్టార్ట్ చేసి కొద్దిరోజులు షూటింగ్ కూడా చేశాడు.
అప్పుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయనందుకోవడంతో ఒక్కసారిగా కమలహాసన్ మార్కెట్ భారీ గా పెరిగింది.దాంతో ఆయన ఇంతకు ముందు ప్లాప్ హీరో గా ఉండేవాడు ఒక్కసారి గా సక్సెస్ ఫుల్ హీరో గా మారిపోయాడు.

దాంతో భారతీయుడు 2 సినిమా ప్రొడ్యూసర్లు కమలహాసన్( Kamala Haasan ) తో సినిమా కంటిన్యూ చేయాలని అనుకొని శంకర్ ని ఆశ్రయించారు.అప్పటికే సినిమా షూట్ లో ఉండడం వల్ల ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను అని చెప్పాడు దాంతో కుదరదని వాళ్లు కోర్టుకెళ్లారు దాంతో మొత్తానికి శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా షూటింగ్ అనేది 4 రోజులు జరిగితే 10 రోజులు వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తుంది.దీనికి కారణం కమలహాసన్ కి శంకర్ కి మధ్య జరుగుతున్న గొడవలే అని సినిమా యూనిట్ చెప్తున్నారు.వాళ్ళిద్దరికీ అసలు పడడం లేదని అందువల్లే సినిమా అనేది డిలే అవుతూ వస్తుందని చాలామంది పేర్కొంటున్నారు.

ఎందుకంటే శంకర్ చెప్పిన సీన్లు కొన్ని కమలహాసన్ కి సరిగ్గా నచ్చడం లేదని అందువల్లే తను ప్రతీది తెలుసుకున్న తర్వాత షూట్ పెట్టాలనే ఉద్దేశ్యం లో ప్రతీది శంకర్ ని అడగడంతో శంకర్ ఫీల్ అయిపోయి ఇద్దరి మధ్య మాట మాట బేధాలు వచ్చినట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్లిద్దరి మధ్య గొడవ సద్దుమణిగి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది…
.







