పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఎన్డీయేలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ పొత్తులు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎటువంటి అప్లికేషన్స్ కూడా తీసుకోమని తెలిపారు.
అభ్యర్థులను పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని వెల్లడించారు.పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.







