బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి షాక్..!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి షాక్ తగిలింది.హైదరాబాద్ లో ఓ ల్యాండ్ కు సంబంధించిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

 Shock For Former Brs Mla Kandala Upender Reddy..!-TeluguStop.com

ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కందాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.రోడ్ నంబర్ 3 లో సుమారు 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కందాల ఉపేందర్ రెడ్డితో పాటు ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 కింద కేసు నమోదు చేశారు.మరోవైపు ఆ స్థలం తమదేనని కందాల ఉపేందర్ రెడ్డి చెబుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube