గుంటూరు జిల్లా పశ్చిమ వైసీపీ కార్యాలయంపై దాడి

గుంటూరు జిల్లాలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంపై దాడి జరిగింది.కార్యాలయంలోకి దూసుకెళ్లిన టీడీపీ – జనసేన కార్యకర్తలు కార్యాలయ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలను చించివేశారని తెలుస్తోంది.

 Guntur District West Ycp Office Attacked-TeluguStop.com

రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయంపై దాడి కేసులో సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే కార్యాలయాన్ని మంత్రి విడదల రజిని పరిశీలించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పథకం ప్రకారమే దాడి జరిగిందన్న మంత్రి రజిని ఘటనకు కారణమైన వారిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.బీసీ మహిళా మంత్రి కార్యాలయంపైనే దాడి చేశారని పేర్కొన్నారు.

బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థమవుతుందని తెలిపారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలకు బీసీలు రాజకీయ సమాధి కడతారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube