రావెన్ పక్షులు( Ravens ) కాకుల లాగానే కనిపిస్తాయి.కాకపోతే ఇవి కాస్త పెద్దగా ఉంటాయి.
అందుకే వీటిని చాలా మంది పెద్ద కాకులు అని కూడా పిలుస్తుంటారు.అయితే ఇతర జీవులపై నాటీ ప్రాంక్స్( Pranks ) చేసే ఆటిట్యూడ్ వీటికి ఉంటుంది.
గాలిలో వెళ్తూ వెళ్తూ తన్నడం లాంటివి ఇవి చేస్తాయి.ఇవి కాస్త పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి కాళ్లతో ఇచ్చే కిక్స్ వల్ల కొద్దిగా ఫిజికల్ పెయిన్ కూడా ఉంటుంది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రావెన్ కాకికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.అందులో దేని జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా నిల్చోని ఉన్న ఒక తోడేలును( Wolf ) ఈ కాకి తన కాళ్లతో తన్నింది.
వెనకనుంచి ఒక కిక్ ఇచ్చి దానికి సడన్ గా షాక్ ఇచ్చింది.దాంతో తోడేలు ఉలిక్కి పడింది.అనంతరం ఇది రావెన్ పక్షి పని అని తెలుసుకుని దానిని వెంబడించింది.

జూలియన్ టెర్రెరోస్ అనే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు.అదే వీడియోను @gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.23 లక్షల వ్యూస్ అందుకున్న ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.ఇది ఏ అడవిలో( Forest ) క్యాప్చర్ చేశారో తెలియ రాలేదు కానీ అది ఒక మంచు ప్రాంతమని తెలుస్తోంది.

ఈ కాకులు జంతువుల మీదే కాదు మనుషుల మీద కూడా ప్రాంక్ చేస్తాయని ఈ వీడియో చూసిన నెటిజన్లు పేర్కొన్నారు.జంతువులు కూడా ఇలాంటి ఫన్ పొందుతాయా అని మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఒకవేళ తోడేలు వేగంగా రియాక్ట్ అయితే ఆ కాకి కథ ముగుస్తుందని మరికొందరు పేర్కొన్నారు.







