కేజిఎఫ్ సినిమాల ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఒకరు.కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ ఇటీవల ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుని ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలవగా రెండో పాఠం ఆసక్తి నెలకొందని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇకపోతే పార్ట్ వన్ క్లైమాక్స్ రెండో భాగంపై పూర్తిస్థాయిలో అంచనాలు పెరగడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అయితే తాజాగా సలార్ 2 గురించి ప్రశాంత్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుంచి కూడా షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ విషయంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ సలార్ 2 ( Salaar 2 ) క్లైమాక్స్ మీ అందరికీ చూపించడానికి నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఈయన వెల్లడించారు.దీంతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.ఇది ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుంది.
ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రశాంత్ రెండో భాగం కూడా షూట్ చేయబోతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు జగపతిబాబు( Jagapathi Babu ), పృధ్విరాజ్, శ్రీయ రెడ్డి పాత్రలు కూడా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
.






