చరణ్ తో ఆ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీ.. ఆయన ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నాడు.మరి రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game Changer ) ఒకటి.

 Is Ram Charan Collaborating With Rajkumar Hirani, Rajkumar Hirani, Dil Raju, Gam-TeluguStop.com

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం తన 15వ సినిమాగా చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా చరణ్ ఇలా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈయన నెక్స్ట్ సినిమాలపై ఏదొక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యిన చరణ్ తో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ తో చరణ్ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి.మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani ) ఈయనతో చరణ్ సినిమా ఉంటుందని రూమర్స్ వస్తుండగా ఈ డైరెక్టర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.కానీ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉంటే కచ్చితంగా చేస్తానని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube