Suma : చీపురు తీసుకొని కొడుకును చితక్కొట్టిన సుమ.. ఏమందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.ఈమె గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Latest News About Suma Kanakala Roshan Kanakala-TeluguStop.com

ఇకపోతే సుమ సినిమాలలో కూడా నటించడం సంగతి తెలిసిందే.అయితే ఈమెకు సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో యాంకర్ గాని స్థిరపడ్డారు ఇక సుమ రాజీవ్ దంపతుల కుమారుడు రోషన్ ఇటీవల బబుల్ గమ్( Bubble Gum Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా రోషన్ కి మొదటి సినిమా అయినప్పటికీ అలా మొదటి సినిమాలో నటిస్తున్నానన్న భావన లేకుండా చాలా బాగా నటించారు.

ఇక ఈ సినిమా ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇందులో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు లిప్ కిస్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమా విడుదలైనప్పటికీ కూడా సుమ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు.

తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఒక గదిలో తన కుమారుడు కూర్చుని లాప్టాప్ లో ఏదో చూస్తూ ఉండగా సుమా రాగానే లాప్టాప్ క్లోజ్ చేశారు.ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ సుమా అడగడంతో ఏం లేదమ్మా అంటూ రోషన్ సమాధానం చెబుతారు.నాకు తెలియకుండా నీ సినిమాలో గోవా పాట చూస్తున్నావ్ కదా నాకెందుకు చూపించలేదు చూపించు అంటూ అడుగుతుంది ఈ పాటను చూపించడంతో అందులో హీరో హీరోయిన్లు గోవా బీచ్ వద్ద చాలా రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తారు అది చూసినటువంటి సుమ ఒక్కసారిగా కొడుకు పై ఫైర్ అవుతుంది.

ఏంట్రా నువ్వు చేసింది అంటూ చీపురు పట్టుకొని తనని కొట్టింది.దీంతో రోషన్ అమ్మ అంటూ అక్కడ నుంచి పారిపోయారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారడంతో సినిమాని ఇంకా ప్రమోట్ చేసే పనిలోనే సుమ మునిగిపోయారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.సుమక్క తన కొడుకుని హైలెట్ చేయడం కోసం గత కొన్ని రోజులుగా భారీగానే కష్టపడుతున్నారు.

అంటూ కొందరు కామెంట్లు చేయగా కొట్టే దానివి చీపురు తిప్పేసి కొట్టు సుమక్క అంటూ మరికొందరు కూడా ఈ వీడియో పై కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube