విజయవాడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.