ట్రోల్స్ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. సునీత కొడుకు ఆకాష్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీ లోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే అంశం అనే విషయం మనకు తెలిసిందే.ఇటీవల ప్రముఖ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ (Suma ) కుమారుడు రోషన్ ( Roshan ) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Singer Sunithason Akash React On Trolls Regards Sarkaaru Noukari , Sunitha , Aka-TeluguStop.com

త్వరలోనే మరో సెలబ్రిటీ వారసుడు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.సుమా ప్రాణ స్నేహితురాలు సింగర్ సునీత( Sunitha ) కుమారుడు ఆకాష్ (Akash) కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈయన హీరోగా నటించిన సర్కారు నౌకరి (Sarkaru Noukari) సినిమా జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Akash, Raghavendra Rao, Roshan Kanakala, Suma, Sunitha-Movie

ఈ సినిమా ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు( Raghavendra Ra ) నిర్మాణ సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా విడుదల చేత దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.

నాకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే ఆసక్తి ఉండేదని తెలిపారు.ఇదే విషయం అమ్మకు చెబితే నువ్వు సినిమాలు చేయడానికి చాలా సమయం ఉంది అంటూ నన్ను చదువుకోమని చెప్పారు.</b

Telugu Akash, Raghavendra Rao, Roshan Kanakala, Suma, Sunitha-Movie

చదువు పూర్తి చేసిన తర్వాత నేను హీరోగా రావాలని కోరుకుంటున్నాను అంటూ తన కోరికను చెప్పడంతో అమ్మ కూడా అందుకు ఒప్పుకోవడం జరిగింది.ఇలా తాను శిక్షణ తీసుకొని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యానని తెలిపారు.ఇక నేను స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ ఇక్కడ నాకంటూ గుర్తింపు సంపాదించుకోవాలి అంటే నేనే కష్టపడాల్సి ఉంటుందని ఆకాష్ తెలిపారు.ఒక స్టార్ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా హిట్ అయితే అందరూ ప్రశంసిస్తారు లేదంటే భారీగా విమర్శలు చేస్తారు.

అలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి ఆ ట్రోల్స్ ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలన్నింటిని కూడా నేను తెలుసుకున్నానని ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిన ఎదుర్కోవడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆకాష్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube