మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజీకి కూడా నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ప్రాణిహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.
రూ.80 వేల కోట్ల నుంచి ప్రాజెక్టు వ్యయం లక్షన్నర కోట్లకు చేరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఫిల్లర్లు ఐదు ఫీట్ల లోతుకు కుంగిపోయాయని చెప్పారు.మేడిగడ్డ బ్యారేజీని తనిఖీ చేయడానికే వచ్చానన్నారు.ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ డ్యామేజ్ కావడం బాధాకరమని పేర్కొన్నారు.దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయిస్తామని చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.