సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ లలో కూడా రాణిస్తూ ఉంటారు.సినిమాలలో వచ్చే లాభాలను బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టి ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.
ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ విషయంలో తను చాలా వీక్ అంటున్నాడు రామ్ చరణ్( Ram Charan ).ఇంకా చెప్పాలంటే, తనను తాను ఒక బ్యాడ్ బిజినెస్ మెన్ గా చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.

సినిమాలు, మూవీ ప్రొడక్షన్ కు సంబంధించి ఏ వ్యాపారం చేయమన్నా నాకు ఇష్టమే.అవి కాకుండా నేనింకేం చేయలేను.నేనో బ్యాడ్ బిజినెస్ మేన్ ని.నేను వ్యాపారవేత్తను కాదు.అంకెలతో నేను డీల్ చేయలేను.రెండు పడవలపై కాళ్లు పెట్టను.ఒకే పడవపై ప్రయాణించడం నాకిష్టం.అదే యాక్టింగ్ అని చెప్పుకొచ్చారు చెర్రీ.
ఇకపోతే రాంచరణ్ కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్( Game changer ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలన్నాయి.ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







