ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే జనసేన పార్టీతో పోత్తు పెట్టుకున్నా , బీజేపినీ పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తిగా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.వైసిపి వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఏపీలో కాంగ్రెస్ కూడా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది.ఈ మేరకు ఏపీ ఫై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
అంతే కాదు ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే కాంగ్రెస్ ఒంటరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసినా, గెలిచే అంత బలం లేదనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే నిన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత డీకే శివకుమార్ తో చర్చ జరిగింది.అయితే ఈ సమావేశం పై ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు దక్షిణాదిలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతగా ఉన్న డీకే శివకుమార్( DK Shivakumar ) తో చర్చలు జరపడం కొత్త రాజకీయ సమీకరణానికి చరతిస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కుప్పం నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు బెంగళూరు కు చంద్రబాబు చేరుకున్నారు.అక్కడ ఎయిర్ పోర్టులో డీకే శివకుమార్ ఎదురయ్యారు.నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ కు హాజరైన డీకే బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు.

ఈ సందర్భంగా ఇద్దరు ఒకరికి ఒకరు పలకరించుకుని అనంతరం పక్కకు వెళ్లి చర్చించుకున్నారు .అయితే ఈ ఇద్దరి మధ్య ఏ విషయంలో చర్చ జరిగింది అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ … బిజెపితో పొత్తు కుదిరే అవకాశం లేకపోతే , కాంగ్రెస్ తోనైనా జత కట్టే అవకాశం పైన చంద్రబాబు డీకేతో చర్చించి ఉంటారనే ప్రచారం ఊపందుకుంది.







