ఏపీలో క్రైమ్ రేట్ తగ్గింది..డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి( AP DGP Rajendranath Reddy ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్( AP Crime Rate ) తగ్గిందని స్పష్టం చేశారు.

 Ap Dgp Rajendranath Reddy Comments On Ap Crime Rate Details, Crime News, Ap Dgp-TeluguStop.com

రాష్ట్రంలో నేరాల శాతం క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, దొంగతనాలు, టూవీలర్ చోరీలు తగ్గాయి.

జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్ హోంగార్డుల వరకు అందరూ సక్రమంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేసాం.

మహిళలపై తీవ్ర నేరాలు తగ్గేలా చేసాం.ఈ క్రమంలో వరకట్నం, పాక్సో కేసులు తగ్గాయి అని వ్యాఖ్యానించారు.

Telugu Ap, Ap Dgp, Apdgp, Cannabis Crops, Cyber Crimes, Dgprajendranath-Latest N

అంతేకాదు రాష్ట్రంలో రౌడీషీటర్స్ పై ఉక్కు పాదం మోపుతున్నామని మొత్తం 4,000 మందిలో 1000 మంది జైల్లో ఉన్నారని లెక్కలు తెలియజేయడం జరిగింది.పదివేల ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేయడం జరిగింది.గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం.గడిచిన మూడు సంవత్సరాలలో ఐదు లక్షల కిలోల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేసినట్లు కూడా స్పష్టం చేశారు.

సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ( Social Media Monitoring Cells ) ఏర్పాటు చేయడం కారణంగా సైబర్ నేరాలు( Cyber Crimes ) 25 శాతం తగ్గాయని సైబర్ నేరాలను అరికట్టేందుకు యంగ్ ఆఫీసర్లకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.ఈ ఏడాది జరిగిన నేరాలు వాటి అదుపునకు తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube