ఏపీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయని తెలుస్తోంది.మంత్రి ఆదిమూలపు సురేశ్ తో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు కొనసాగాయి.
చర్చల్లో మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్లపై మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో కార్మికులు సమ్మెను విరమించాలని మంత్రి ఆదిమూలపు కోరారు.
అయితే ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని, సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ కార్మికులు చెబుతున్నట్లు సమాచారం.అయితే గత మూడు రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.కనీస వేతనం రూ.26 వేలు అందించడంతో పాటు ఫీల్డులో పని చేసే కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.







