Prabhas : పడగలు విప్పుతున్న బాలీవుడ్ మాఫియా… మళ్లీ ప్రభాస్ కోసం భారీ స్కెచ్ వేశారు కదా..?

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంటుంది అని అందరికీ తెలుసు.అలాగే బాలీవుడ్ విషయానికొచ్చేసరికి వారిది ఒక మాఫియా లాగా ఉంటుంది.

 Bollywood Heap Tricks For Sharukh Khan-TeluguStop.com

అందుకే చాలామంది ఆ మాఫియాకు ఎదురు వెళ్లి నిలబడలేక పోతున్నారు.ఇప్పటికీ బాలీవుడ్ మాఫియా ముందు ఏ హీరో కూడా వారిని ఎదిరించి నిలబడలేదు.

అయితే బాలీవుడ్ కోటపై రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు ప్రభాస్.బాహుబలి సినిమాతో ఆ కోటకు బీటలు రావడం మొదలైంది.

ఎక్కడో సౌత్ లో నుంచి ఒక హీరో వచ్చి బాలీవుడ్ దుమ్ము దులుపుతాడని ఎవరు ఊహించి ఉండరు.కానీ ఆ తర్వాత నుంచి ఒకరి తరువాత ఒకరు బాలీవుడ్ కి చెక్ పెడుతూ వస్తున్నారు.

అయితే అందరి విషయం పక్కనపెడితే ప్రభాస్( Prabhas ) విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.ఏంటి అంటే బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత మరొక విజయాన్ని అతడు అందుకోలేకపోయాడు.

Telugu Salaar, Baahubali, Bollywood, Bollywood Mafia, Dunki, Prabhas, Sandeepred

దాంతో ప్రభాస్ పై వారి కి పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు.కానీ ప్రభాస్ తన మంచితనంతో ఎక్కడ ఎవరితో ఇబ్బందులు పెట్టుకోకుండా బాగానే నడిపిస్తాడు కాబట్టి ఏ నిర్మాణ సంస్థతో అతనికి ఇబ్బందులు లేవు.ఇక ఉన్నట్టుండి సలార్ సినిమా విజయం సాధించింది దానికన్నా ముందు షారుక్ ఖాన్ డంకి సినిమాతో ప్రభాస్ గట్టిగా దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.అసలు సలార్ బాలీవుడ్ సినిమానే కాదు అన్నట్టుగా వారు వివరించడంతో ప్రశాంత్ అలాగే హుంబలీ ఫిలిం వారు చాలా సీరియస్ గా ప్రభాస్ సినిమా కోసం పనిచేశారు.

సలార్ కి షోలు ఇవ్వని వారికి దేశంలో ఎక్కడా కూడా వారికి సినిమాను ఇచ్చేది లేదని ప్రశాంత టీం డిసైడ్ కావడంతో కొంతమేర వెనక్కి తగ్గారు షారుక్ మిత్రగణం.

Telugu Salaar, Baahubali, Bollywood, Bollywood Mafia, Dunki, Prabhas, Sandeepred

అయితే డంకి పరాజయం పాలయింది.ఒక్కో షో పడుతున్న చోట పూర్తిగా రీలు తీసి డస్ట్ బిన్ లో వేసి సలార్ సినిమా( Salaar ) షోలు వేసుకొని థియేటర్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు.డంకీని పట్టించుకునే వారు లేరు.

దాంతో ఆ కోపం ప్రస్తుతం ప్రబాస్ సలార్ పై బాలీవుడ్ మాఫియా చూపిస్తోంది.ఉన్నట్టుండి మళ్లీ డంకి ( Dunki movie )కి షోలు ప్రారంభమయ్యాయి.

పైగా ప్రభాస్ విజయం సాధించడంతో ఎక్కడ తన ఉనికి కి ప్రమాదమో అని బాలీవుడ్ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.సాలార్ సినిమా విజయం సాధించింది దీని తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా ఉంది.

నాగ్ అశ్విన్ తో మరొక సినిమా ఉంది.అన్ని పాన్ ఇండియా సినిమాలు.

ఇవన్నీ జరిగితే ప్రభాస్ మళ్ళీ పుంజుకొని నెంబర్ వన్ హీరోగా ఇండియా వ్యాప్తంగా నిలబడిపోతాడు.అందుకోసం సలార్ ని తొక్కే ప్రయత్నాలు బాలీవుడ్ లో గట్టిగా జరుగుతున్నాయి.

పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు పూర్తిగా సలార్ షో లోని పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube