సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీపై అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ ముగిసింది.ఈ సమావేశంలో ప్రధానంగా నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ పై అమిత్ షా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

 Amit Shah's Green Signal On Contesting The Same Seat For Sitting Mps..!!-TeluguStop.com

సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు.పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడటం కానీ, లీకులు ఇవ్వడం కానీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరించారు.

ఎంపీ టికెట్ ఆశావాహులు, వారి బలాబలాలపైనా అమిత్ షా ఆరా తీశారని సమాచారం.అలాగే సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube