ఏపీలో జన్మత్ పోల్స్ సర్వే.. వైసీపీదే అధికారమంటూ..!!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరి దృష్టి ఇప్పుడు ఏపీపైనే ఉంది.అటు పార్టీలు సైతం అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

 Janmat Polls Survey In Ap.. Ycp Is In Power..!!-TeluguStop.com

ఇందులో భాగంగానే ప్రజల నాడిని అంచనా వేయడంతో పాటు ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి విజయపతాకాన్ని ఎగుర వేయాలని భావిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పార్టీల నేతలు.అయితే ఏపీలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది? రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుంది? అనే అంశాలపై జన్మత్ పోల్స్ ఓ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే వెల్లడించింది.రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలుండగా.అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైసీపీ) 116 నుంచి 118 సీట్లను గెలుపొందుతుందని సర్వే పేర్కొంది.

అలాగే టీడీపీ – జనసేన ఉమ్మడిగా 46 నుంచి 48 స్థానాలను సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.ఈ సర్వే ఫలితాలను బట్టి ఏపీలో నెక్ట్ ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగనేనని స్పష్టం అవుతుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.సీఎం వైఎస్ జగన్ సర్కార్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు విజయాన్ని అందిస్తాయని సర్వేలో వెల్లడైందని తెలుస్తోంది.

పేదల పక్షపాతిగా నిలిచిన సీఎం వైఎస్ పార్టీలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తూ పాలన అందించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు ఎవరూ ఇబ్బంది పడకుండా సంక్షేమ పథకాలను అందించిన జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ ఇష్టాన్ని కనబరుస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలోని నిరుపేదలందరూ తమకు ఎంతో అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నారని సమాచారం.అందుకే ఏపీలో మరోసారి వైసీపీ విజయభేరి మోగించడం ఖాయమని సర్వేలో తేలింది.

గతంలోనూ జన్మత్ పోల్స్ సర్వే సంస్థ చెప్పిన విధంగానే తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేలో మరోసారి వైసీపీదే విజయమని వెల్లడి అయింది.

గత ఫలితాలను బట్టి చూస్తే సర్వే సంస్థ వెల్లడించినట్లు ఏపీలో 2024 లో మరోసారి వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని, వైసీపీ విజయపతాకం ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube