యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన అడపు శంకరయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోగా మాతృదేవోభవ అనాధాశ్రమ నిర్వాహకులు గట్టు గిరి స్పందించారు.వెంటనే గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన ఇంటిని పరిశీలించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు రూ.20 వేల చెక్కు,క్వింటా బియ్యం,3 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసి మానవత్యం చాటుకున్నారు.ఈ సందర్భంగా గట్టు గిరి మాట్లాడుతూ మీరు ఇబ్బంది పడొద్దని,మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా ఆశ్రమాన్ని సంప్రదించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం ఉప సర్పంచ్ ఉప్పరగోని సంజీవ, మినుగు రఘుపతి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News