తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కరిది కాదు.టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసి తమదైన రీతిలో తమ ప్రత్యేకతను చాటుకోవచ్చు దీనికి ఎగ్జాంపుల్ గా ఇప్పటికే సోలోగా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అలాంటి ట్రెండే ఇక్కడ నడుస్తుంది.
చాలామంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చి తమదైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు గా ఉన్న వాళ్ళు కూడా తమకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక కొత్త డైరెక్టర్ గా వచ్చిన శ్రీకాంత్ ఓదెల( Director Srikanth Odela ) లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో తమదైన సత్తాని చాటుకున్నారు మొదటి సినిమా అయిన దసర సినిమాతో( Dasara Movie ) ఈయన స్టార్ హీరోలను సైతం మెప్పించేలా ఒక సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈయన రీసెంట్ గా విజయ్ దేవరకొండ కి ( Vijay Devarakonda ) ఒక కథ వినిపించినట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక ఇప్పటికే నానితో ( Nani ) ఒక సినిమా చేయాల్సి ఉండగా అది కొంచెం డిలే అయ్యే ప్రాసెస్ లో విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ హీరోకి ఒక మంచి కథను వినిపించారనే సమాచారమైతే అందుతుంది.

అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్( Family Star ) అలాగే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఇన్వాల్వ్ అవ్వనున్నట్ట గా తెలుస్తుంది… ఇక ఇప్పటికే శ్రీకాంత్ చెప్పిన కథ విజయ్ కి బాగా నచ్చడంతో ఈ సినిమాని పట్టా లెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







