ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా గుర్తింపు పొందుతున్న ఏ గ్రేడ్ హీరోలు అందరూ కూడా వరుసగా సక్సెస్ లు సాధిస్తున్నారు కానీ సెకండ్ గ్రేడ్ హీరోగా పేరుపొందిన గోపీచంద్( Gopichand ) మాత్రం వరుసగా ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడు.ఇక ఇప్పుడు ఈయన శ్రీను వైట్ల తో( Srinu Vaitla ) తీస్తున్న సినిమా పైన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది బయటికి వచ్చింది.
అది ఏంటి అంటే శ్రీనువైట్ల ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ని( Item Song ) రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్ ని దింపబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇదంతా చూసిన అభిమానులు ఎప్పటి లాగానే శ్రీను వైట్ల మళ్ళీ రొటీన్ కమర్షియల్ సినిమా నే తెరకెక్కిస్తున్నాడా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి శ్రీనువైట్ల లాంటి ఒక డైరెక్టర్ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయాడు కానీ గోపీచంద్ లాంటి ఒక హీరో అతనికి అవకాశం ఇవ్వడం వల్ల మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి మన ముందుకు రాబోతున్నాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ శ్రీను వైట్ల ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు ఎందుకంటే శ్రీను వైట్ల( Srinu Vaitla ) మళ్ళీ అదే రొటీన్ ఫార్ములాలో వెళ్తే మాత్రం ఈసారి బొక్క బోర్ల పడడం ఖాయం అంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

గోపీచంద్ ని( Gopichand ) రొటీన్ కమర్షియల్ ఫార్ములాలతో హిట్ కొట్టాడు కాబట్టి మళ్లీ అదే ఫార్ములాని ఫాలో అయితే మాత్రం గోపీచంద్ శ్రీనువైట్లకి ఇద్దరికీ భారీ ప్లాపైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక దాంతో ఈ సినిమా మీదనే గోపీచంద్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు కాబట్టి ఈ సినిమాని జర జాగ్రత్తగా తెరకెక్కిస్తే ఇద్దరి కెరియర్లు బాగుంటాయని చాలామంది అభిమానులు తెలియజేస్తున్నారు…
.







