ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా( Devara ) మీద ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకులు కూడా చాలా అంచనాలు పెట్టుకోవడమే కాకుండా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ గాని గ్లిమ్స్ గాని ఏమీ రాకపోవడంతో అవి ఎప్పుడు వస్తాయి అంటూ అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా నుంచి టీజర్ గాని గ్లిమ్స్ గాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఒక్కసారి టీజర్ బయటికి వచ్చిందంటే ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయంటూ చిత్ర యూనిట్ నుంచి మంచి ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ని తొందరలోనే రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంతలోనే సినిమా నుంచి ఒక డైలాగ్( Devara Dialogue ) లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ డైలాగ్ సినిమాలో ఎన్టీఆర్( NTR ) చెప్పినట్టుగా తెలుస్తుంది.

అది ఏంటి అంటే “ప్రాణాల మీద ఆశ ఉన్నవాళ్లు పారిపోండి, ప్రాణం పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే నాతో పోటీకి సిద్ధం కండి” అంటూ ఎన్టీఆర్ చెప్పే ఈ డైలాగు సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ ని బేస్ చేసుకుని రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సీను సినిమాలో ఎక్కడుంటుంది ప్రేక్షకులను ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాలో ఎన్టీయార్ చాలా కొత్తగా కనిపించబోతున్నట్టు గా తెలుస్తుంది…
.







