బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.గతంలో ఏ బిగ్ బాస్ విజేత( Bigg Boss Winner ) ఎదుర్కోని స్థాయిలో పల్లవి ప్రశాంత్ వివాదాల్లో చిక్కుకున్నారు.
అయితే బిగ్ బాస్ సీజన్2 విజేత కౌశల్( Kaushal ) పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.పల్లవి ప్రశాంత్ కు బ్యాగ్రౌండ్ లేదు కాబట్టే టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు.
పల్లవి ప్రశాంత్ కు ప్రజల్లో రైతుబిడ్డ అనే సానుభూతి ఉన్నా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో కొంతమంది అతనిని టార్గెట్ చేశారని కౌశల్ తెలిపారు.బిగ్ బాస్ సీజన్2 నుంచి ఈ తరహా వివాదాలు మొదలయ్యాయని కౌశల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీజన్ 2 ట్రైలర్ అయితే సీజన్ 7( Bigg Boss 7 ) మూవీ అని కౌశల్ మందా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.పల్లవి ప్రశాంత్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులదే తప్పు అని కౌశల్ అన్నారు.

సిటీ బయట ఈ తరహా షోలను నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కౌశల్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.సిటీ మధ్యలో అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) ఉందని అక్కడ బిగ్ బాస్ షోను నిర్వహించడం వల్ల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కౌశల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.బిగ్ బాస్ విజేత నుంచి పబ్లిసిటీ పొందాలని చాలామంది ప్రయత్నిస్తారని కౌశల్ అన్నారు.

పల్లవి ప్రశాంత్ దొంగ దారిలో వెళ్లిపోయి ఉంటే అతనికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని కౌశల్ మందా అభిప్రాయం వ్యక్తం చేశారు.జైలుకు వెళ్లి రావడం పల్లవి ప్రశాంత్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపదని కౌశల్ వెల్లడించారు.కౌశల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.







