ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన హీరో విశాల్... కెమెరాని చూసి పారిపోయారుగా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశాల్( Vishal ) ఒకరు.ఈయన హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 Hero Vishal Walking With Girl In New York City Streets, Vishal , Girl , Tol-TeluguStop.com

ఇక విశాల్ నటించే సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయనే సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన సినిమాలకు తెలుగు తమిళ భాషలలో భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారు.

వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇప్పటివరకు బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నారు.

Telugu Kollywood, York, Tollywood, Vishal-Movie

ఈయన రెండుసార్లు పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చేసుకున్నారు .అయితే గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar ) తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.అదేవిధంగా ఇటీవల మరొక నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఈయన గురించి వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై ఈయన స్పందిస్తూ… తాను ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోలేదని ప్రస్తుతం కెరియర్ పైనే తన ఫోకస్ ఉంది అంటూ విశాల్ తెలియజేశారు.

Telugu Kollywood, York, Tollywood, Vishal-Movie

ఇకపోతే విశాల్ తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ప్రస్తుతం న్యూ యార్క్ సిటీలో ( New York City )ఉన్నారు.అక్కడ ఈయన ఒక అమ్మాయి భుజంపై చేతులు వేసుకొని వీధులలో చక్కర్లు కొట్టారు.అయితే తనని ఎవరు గమనించలేదని అమ్మాయితో వెళ్తున్నటువంటి ఈయనపై కొందరు ఫోకస్ చేసి వీడియో తీశారు.

అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి విశాల్ వెంటనే ఆ అమ్మాయితో కలిసి అక్కడి నుంచి పారిపోయారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విశాల్ తో పాటు ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇది కేవలం సినిమా ప్రమోషన్లలో భాగమే అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.

మరి ఇందులో ఏది నిజమో అనేది తెలియాలి అంటే విశాల్ స్పందించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube