టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్( Ram Charan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన మెగాస్టార్ వారసుడి గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో తను 100% సక్సెస్ అయ్యాడు.
అందుకే ఆయన చేసిన ప్రతి సినిమాతో కూడా ఆయన చాలా మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక ఆయన పాన్ ఇండియా రేంజ్ లో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా( RRR ) అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో పాటు ఆయన క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది.
ఇక దీంతో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమా పట్ల ప్రతి అభిమాని కూడా చాలా పాజిటివ్స్ స్పందించారు.
ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చెంజర్ సినిమా( Game Changer ) మీదనే తన దృష్టి ని పెట్టినట్టు గా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబో లో ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది.దీనికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్( Allu Aravind ) ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్టు గా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ఎవడు( Yevadu ) అనే సినిమా వచ్చింది.
అయినప్పటికీ అందులో ఇద్దరు కలిసి మాత్రం నటించలేదు జస్ట్ ఒక 15 నిమిషాల పాత్ర కోసం అల్లు అర్జున్( Allu Arjun ) సినిమాలో నటించాడు అయినప్పటికీ ఈ సినిమాలో తను పోషించిన పాత్ర కి కూడా చాలా మంచి పేరు వచ్చింది…ఇక ఇప్పుడు ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ లను అందుకున్నారు కాబట్టి వీళ్ళ కాంబో లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టు గా తెలుస్తుంది…
.