సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో సలార్2 మూవీ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.సలార్2( Salaar 2 ) లో ప్రభాస్ తండ్రి పాత్ర ఉండనుందని సమాచారం అందుతోంది.కోర మీసంతో తండ్రి పాత్రలో ప్రభాస్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని తెలుస్తోంది.సలార్2 లో ప్రభాస్ తాను శౌర్యాంగ అని తెలిసిన తర్వాత ఏం చేస్తాడనేదే సినిమాకు కీలకం కానుంది.

సలార్2 మూవీ( Salaar2 )లో యశ్ ఉన్నట్టు జరిగిన ప్రచారంలో అయితే ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది.సలార్2 మూవీలో వరద రాజమన్నార్ తమ్ముడి పాత్రను ప్రభాస్ ( Prabhas )రోల్ చంపేస్తుందని అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో సలార్ ఆ పాత్రను చంపేయడం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం మొదలవుతుందని సమాచారం అందుతోంది.సలార్1 కన్నడ వెర్షన్ లో ఒక పాత్రకు యశ్ డబ్బింగ్ చెప్పారని భోగట్టా.

సలార్2 లో దేవా తండ్రి పాత్ర బాహుబలి సిరీస్ లో అమరేంద్ర బాహుబలిలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది.శృతి తల్లి పాత్ర మరణానికి సంబంధించి ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.సలార్2 సినిమాకు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు హైలెట్ గా ఉండనున్నాయని సమాచారం.సలార్2 సినిమాలో రాజమన్నార్ పాత్ర చనిపోయి ఉంటుందని తెలుస్తోంది.రాధా రమ పాత్ర భర్త మరణం వల్లే ఆ పాత్ర దేవా పాత్రపై పగ పెంచుకుంటుందని తెలుస్తోంది.ప్రభాస్ కు తాను శౌర్యాంగ అని తెలుసా? తెలియదా? అనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.సలార్2 క్లైమాక్స్ కూడా సరికొత్తగా ఉండబోతుందని సమాచారం అందుతోంది.సలార్2 మూవీ వేరే లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.సలార్2 మూవీ నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది.







