బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి తాజా చిత్రం యానిమల్ ( Animal )ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటికీ ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతున్నప్పటికీ ఈ సినిమాపై సలార్ దెబ్బ పడిందని తెలుస్తుంది.అయితే తాజాగా సందీప్ రెడ్డి ( Sandeep Reddy )ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ఈయన వెల్లడించారు.

ఇప్పటివరకు తమ సినిమా సుమారు 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని మేము ఇంకా 1000 కోట్ల క్లబ్లో చేరలేదని సందీప్ రెడ్డి వెల్లడించారు.అయితే కలెక్షన్ల పరంగా మేము అన్ని వాస్తవాలు చెబుతున్నామని ఇందులో ఏ విధమైనటువంటి ఫేక్ సమాచారం లేదంటూ సందీప్ రెడ్డి తెలిపారు.ఇక ఈ సినిమా విడుదలైనటువంటి మొదటివారం సినిమాకు థియేటర్లు దొరకక అలాగే లాంగ్ వీకెండ్ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా కొంతమేర నష్టాలు వచ్చాయని తెలిపారు.

సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని భావించారు అయితే థియేటర్లు ఎక్కువగా దొరక్కపోవడంతో మాకు సుమారు 40 కోట్ల వరకు మొదటి వారంలోనే నష్టాలు వచ్చాయని ఈయన వెల్లడించారు.ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎవరూ కూడా బోర్ గా ఫీల్ అవ్వలేదని సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నచ్చలేదని చెబుతున్నారు అయితే అందరికీ అన్ని సన్నివేశాలు నచ్చేలా తియ్యడం అంటే అసంభవం అంటూ ఈయన తెలిపారు.ఇక ప్రస్తుతం మేము ఓటీటీ వర్షన్ కోసం పనిచేస్తున్నామని, ఓటీటీలో విడుదల చేయడం కోసం మరికొన్ని సన్నివేశాలను జోడించాల లేదా అన్న విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సందీప్ రెడ్డి తెలిపారు.







