సోషల్ మీడియాలో ( Social media )వైరల్ అయ్యే చిన్న పిల్లల వీడియోలు ఎంతో ఆకట్టుకుంటాయి.ముచ్చట గొలుపే చిన్నారులు చేసే చేష్టలు మరింత ఫిదా చేస్తాయి.
తాజాగా ఆ కోవకి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో తండ్రి, తల్లి ఇద్దరూ బెడ్ మీద పడుకొని ఉండటం చూడవచ్చు.వారి పక్కనే వారి చిన్నారి అటూ ఇటూ పాకుతూ కనిపించింది.దాన్ని బట్టి తనకు నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది.దీనికి కారణం తన తండ్రి పెద్దగా గురక పెట్టడమేనని చెప్పవచ్చు.“నీ కొరక వల్ల నా నిద్ర ఖరాబ్ అవుతోంది” అన్నట్లు ఈ చిన్నారి తండ్రి వద్దకు వెళ్లి చెంప మీద ఒక లెంపకాయ వేసింది.ఆ దెబ్బకు తండ్రి అయ్యో, అమ్మో, కుర్రో అంటూ అరిచేశాడు.

తర్వాత ఆ చిన్నారి వెళ్లి తన తల్లి పక్కన పడుకుంది.మళ్లీ కొద్దిసేపటికి గురక పెడుతూ చిన్నారి స్లీప్ ( Baby sleep )డిస్టర్బ్ చేశాడు.అంతే మళ్ళీ ఆ చిన్నారి వెళ్లి తన తండ్రిని కొట్టింది.
ఇది చూసి తల్లి తెగ నవ్వేసింది.ఈ వీడియో చాలా మందిని ఫిదా చేస్తోంది.
దీన్ని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.అయ్యో పాపం ఆ చిన్నారి నిద్రకు తండ్రి గురక ఎంత భారమైపోయిందో అని అంటున్నారు.
ఇంకా అంబాడే స్థాయిలో ఉన్నా ఈ చిన్నారి తండ్రిని ఉతికేస్తోందిగా అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఈ వీడియో ( viral video )హిలేరియస్‌గా ఉందని మరికొందరు అన్నారు.@gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.ఒక కోటికి పైగా దీనికి వ్యూస్ వచ్చాయి, 60 వేల దాకా లైక్స్ వచ్చాయి.







