నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లో సింహం తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివారులోని తెలుగు గంగ కాలువపై సింహం సంచరిస్తుందంటూ ఆకతాయిలు ఓ వీడియోను ప్రచారం చేశారు.
దీంతో చుట్టు పక్కల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ వార్తలపై రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో ఫేక్ అని గుర్తించారు.ఈ క్రమంలో ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారని తెలుస్తోంది.వీరిలో ఇద్దరు మధ్యప్రదేశ్ కు చెందిన వారు కాగా మరొక యువకుడు స్థానికుడిగా గుర్తించారు.అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.







