పేద కుటుంబంలో జన్మించిన వాళ్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి.భద్రాద్రి జిల్లా( Bhadradri District ) సీతంపేట పరిధిలోని రెడ్డిపాలెంకు చెందిన లావుడ్యా ఆనంద్ సీఎంటీఐలో సైంటిస్ట్ గా ఎంపికయ్యారు.
ఆనంద్( Anand ) తల్లీదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆనంద్ సైంటిస్ట్ గా( Scientist ) ఎంపిక కావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
చెన్నై బీఈ పూర్తి చేసిన ఆనంద్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు.
ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఆనంద్ కెరీర్ పై దృష్టి పెట్టారు.
పోటీ పరీక్షలకు ప్రిపేరై బెంగళూరులోని బీఈఎల్ లో ట్రెయినీ ఇంజనీర్ జాబ్ సాధించారు.ఆ తర్వాత హైదరాబాద్ లోని డీఆర్డీవోలో( DRDO ) రీసెర్చ్ ఫెలో ఉద్యోగం సాధించారు.
ఆ తర్వాత సీఎంటీఐలో సైంటిస్ట్( CMTI Scientist ) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుని సక్సెస్ అయ్యారు.ఆనంద్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తన కల నెరవేరిందని ఆనంద్ చెప్పుకొచ్చారు.ఆనంద్ భవిష్యత్తులో కెరీర్ పరంగా సక్సెస్ ( Success ) సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తన సక్సెస్ వెనుక కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉందని ఆనంద్ చెబుతున్నారు.ఆనంద్ సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.ఆనంద్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

లావుడ్యా ఆనంద్ తనలా పేద కుటుంబం నుంచి వచ్చి కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని భావించే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన ఆనంద్ ప్రస్తుతం శాస్త్రవేత్తగా ఎదిగారు.ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.6 నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ స్కూల్ లో చదువుకున్న ఆనంద్ ఈ స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







