Salaar : ప్రభాస్ హీరోగా చేస్తున్నాడని సలార్ సినిమాలో కీలక రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ యాక్ట్రెస్.. ఎవరంటే…

సలార్( Salaar )” మూవీ మంచి మౌత్ టాక్ తో భారీ కలెక్షన్లను వసూల్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ), పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran )పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌ కూడా హైలెట్ అయ్యాయి.

 Varalakshmi Rejected A Offer In Salar-TeluguStop.com

ముఖ్యంగా శ్రియా రెడ్డి పాత్ర చాలా హైలెట్ అయింది .శ్రియా రెడ్డి సలార్‌లో రాధా రామ అనే క్యారెక్టర్ చేసింది.ఈ చెన్నై బ్యూటీ టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగింది.“అప్పుడప్పుడు”, “అమ్మ చెప్పింది” సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సలార్ తోనే ఈ తార ప్రేక్షకులను పలకరించింది.

Telugu Jagapathi Babu, Prabhas, Salaar, Sriya Reddy, Tollywood, Varalakshmi-Movi

నిజానికి రాధా రామ యాంటీ రోల్ మొదటగా శ్రియా రెడ్డి వద్దకు రాలేదు.ఈ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ కూతురును నటింపజేయాలని ప్రశాంత్ నీల్‌ అనుకున్నాడు.అందుకే వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) ని ఎంచుకున్నాడు.కానీ ఈ పాత్ర చేసేందుకు ఆమె ఒప్పుకోలేదు.ఎందుకంటే ప్రభాస్ కి నెగిటివ్ గా చేస్తే ఆ పాత్రకు గుర్తింపు ఏముంటుందని ఆమె భావించిందట.అంతేకాదు ప్రభాస్ లాంటి స్టార్డమ్‌ ఉన్న పాన్ హీరో సినిమాలో నటిస్తే అతడిని తప్ప మిగతా ఏ యాక్టర్‌ని కూడా ప్రేక్షకులు పట్టించుకోరని అభిప్రాయ పడిందట.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు( Jagapathi Babu ), పృథ్వీరాజ్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి తనకిచ్చే పాత్ర అసలు హైలెట్ కాదని ఆమె అంచనా వేసిందట.అందుకే దీనిని సింపుల్‌గా సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

Telugu Jagapathi Babu, Prabhas, Salaar, Sriya Reddy, Tollywood, Varalakshmi-Movi

అయితే ఆమె అనుకున్నట్లు సలార్ సినిమాలో ప్రభాస్ ఒక్కడికే గుర్తింపు రాలేదు.కీలక పాత్రలు పోషించిన వారందరికీ మంచి పేరు వచ్చింది.పైగా సలార్‌ మూవీ మంచి హిట్ కూడా అయింది.ఈ రిజల్ట్ చూసి వరలక్ష్మి ప్రస్తుతం బాధపడిపోతుందట.ఆ పాత్ర చేసినా బాగుండు అని పశ్చాత్తాప పడుతుందట.ఏదేమైనా ఈమె ఆ రోల్ రిజెక్ట్ చేయడం శ్రియా రెడ్డి( Sriya Reddy )కి అదృష్టంగా మారింది.

శ్రియా తనకు ఆఫర్ చేసిన రాధా రామ క్యారెక్టర్‌లో చక్కగా నటించి మన్నలను అందుకుంటోంది.ఏదేమైనా వరలక్ష్మికి చాలా అనుభవం ఉంది.

చాలా సినిమాల్లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకుంది. సలార్ సినిమా విషయంలో ఆమె రోల్ ఔట్ పుట్ మిస్ అండర్ స్టాండింగ్ చేసుకుని బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకుంది.

ఇక భవిష్యత్తులో ఆమె క్యారెక్టర్స్ రిజెక్ట్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube