ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈయన చేతిలో మూడు సినిమాలు ఉండగా మూడు కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే.
మరి ఈ సినిమాల్లో ”దేవర’‘( Devara ) ఒకటి.ఈ సినిమా కోసమే తారక్ ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్( Young Tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇప్పటికే చాలా వరకు షూట్ పూర్తి చేసుకుంది.ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దేవర సినిమాను మొదలెట్టాడు.
మరి ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి ఇన్ని అంచనాలు ఉండడంతో ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారట.
అందుకు ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు టాక్.
వచ్చే ఏడాది జనవరి 8న ఈ టీజర్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారట.మరి ఈ విషయంపై అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుంటే హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఎన్టీఆర్ సరసన ఆడిపాడబోతుంది.
విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.