తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) తనదైన తన దైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా పాన్ ఇండియా లెవెల్ లో ఒక భారీ స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టాయి.ఇక ఇప్పుడు సలార్( Salar ) సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ పైన తన పంజాని విసిరాడు.
ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల వరకు కలక్షన్లను రాబడుతుందంటూ చాలా మీడియా సంస్థలు ఇప్పటికే కథనాలు అయితే రాస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా 1000 కోట్లకు పైన కలక్షన్స్ ని వసూలు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే బాలీవుడ్ లో కలక్షన్ల సునామీ సృష్టిస్తుంది.ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది ప్రభాస్ ని చాలా సంవత్సరాల తర్వాత చాలా హైలో చూపించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ నీల్ ( Prashanth Neil ) అనే చెప్పాలి.
బహుబలి తర్వాత ప్రభాస్ లాంటి ఒక హీరోని బాగా ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ 100% సక్సెస్ అయ్యారు…ఇక ఇప్పుడు ఏ భాషలో చూసిన సలార్ ప్రభంజనమే నడుస్తుంది.ప్రభాస్ ఊచకోతకు బాక్సాఫీస్ బద్దలైపోయాయి.

మూడు సినిమాల తర్వాత వచ్చిన సక్సెస్ కావడం వల్ల ప్రభాస్ అభిమానుల్లో కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది అంటూ భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రభాస్ మరోసారి ప్లాన్ ఇండియాలో తన సత్తాను చాటాడు… దీని తర్వాత నాగాశ్విన్ తో కల్కి సినిమా పైన ప్రభాస్ తన దృష్టిని కేంద్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది.








