క్రికెట్ టీమ్ ను పరిచయం చేసిన చరణ్.. ప్రోమో చూసారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నాడు.మరి రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game Changer ) ఒకటి.

 Ram Charan The Proud Of Owner Of Hyderabad Team, Game Changer, Ram Charan, Tolly-TeluguStop.com

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం తన 15వ సినిమాగా చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా చరణ్ ఇలా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నప్పటికీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడు.ఇంతకీ చరణ్ ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటంటే.ఇండియాలో సినిమాలను ఎంతగా ఇష్టపడతారో అలాగే క్రికెట్ ను కూడా ఇష్టపడే వారు కోట్లలో ఉన్నారు.మరి ఇప్పుడు చరణ్ క్రికెట్ టీమ్ తో రాబోతున్నాడు.తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసారు.షార్ట్ ఫార్మాట్ లో కొత్తగా వచ్చిన క్రికెట్ లీడ్ ”ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్” ( ISPL ) లో తన జట్టు కూడా పాల్గొనబోతుందంటూ తన జట్టును పరిచయం చేస్తూ తాను హైదరాబాద్ టీమ్ కు బాస్ గా సారథ్యం వహించబోతున్నట్టు తెలిపారు.

మరి చరణ్ ఈ కొత్త జర్నీ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube