పెళ్లి వీడియో షేర్ చేసిన సుమ.. సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

టాలీవుడ్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ( Suma ) ఒకరు ఈమె గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా నటిగా యాంకర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

 Suma Kanakala Shares Marriage Video, Suma Kanakala, Marriage Video, Rajeev Kanak-TeluguStop.com

సుమ నటుడు రాజీవ్ కనకాలను( Rajeev Kanakala ) వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు.ఈమె కేరళ అమ్మాయి అయినప్పటికీ తన తండ్రి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు.

ఈ క్రమంలోనే రాజీవ్ కనకాలతో ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారింది.ఇలా పెద్దలను ఒప్పించి సుమా తనని పెళ్లి చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక సుమ కుమారుడు త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి కూడా తెలిసిందే.ఈమె తన కొడుకు సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే సుమ తాజాగా తన పెళ్లి వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

పెళ్లిలో తాళి కట్టి దండలు మార్చుకున్నటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి ఒక వీడియోని ఈమె షేర్ చేస్తూ స్వీట్ మెమోరీస్ అంటూ తన పెళ్లి వీడియోని అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సుమక్క మీరు అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు పెద్దగా మార్పు ఏమీ లేదు మీలో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా మరికొందరు మీరు పెళ్లిలో చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సుమ వయసు పెరుగుతున్న తనతో పాటు అందం తనలో చలాకీతనం కూడా పెరుగుతుందనే విషయం తెలిసిందే.ఇలా ఈమె పెళ్లి సమయంలోను ఇప్పటికీ కూడా ఒకే విధంగా ఉండటంతో చాలామంది సుమక్క సంతూర్ మమ్మీ అంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.వయసు పెరిగిన ఈమెలో వయసు కనపడటం లేదని అప్పటికి ఇప్పటికీ ఒకే లాగా ఉంది అంటూ కొందరు నెటిజన్స్ ఇలా ఈ వీడియోలపై కామెంట్ చేయడం విశేషం.

ఇక సుమ కుమారుడు నటించిన బబుల్ గమ్ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్లను భారీగా నిర్వహిస్తున్నారు.మరి రోషన్ తల్లిదండ్రుల లాగే ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube