అమెరికా : భారతీయుల ఇళ్లే టార్గెట్ .. వరుసపెట్టి చోరీలు, బిక్కుబిక్కుమంటోన్న ఎన్ఆర్ఐలు

అమెరికాలో దొంగలు రెచ్చిపోతున్నారు.భారతీయుల ఇళ్లే టార్గెట్‌గా వరుస చోరీలకు పాల్పడుతున్నారు.

 Spike In Residential Burglaries In Washington Targeting Indian Americans , India-TeluguStop.com

వాషింగ్టన్ రాష్ట్రంలోని పాకెట్స్‌లో ఇండో అమెరికన్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత చోరీలు పెరిగాయని స్థానిక మీడియా నివేదించింది.స్నో హోమిష్ కౌంటీ పోలీసులు దొంగల కోసం అన్వేషణ ప్రారంభించారు.

ప్రధానంగా ఇన్‌కార్పోరేటెడ్ బోథెల్ ( Incorporated Bothell )ప్రాంతంలోని ఇండో అమెరికన్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.వీరిని పట్టుకునేందుకు పోలీసులు.

ప్రజలు తమకు సహాయం చేయాలని కోరుతున్నారు.

Telugu America, Cctv Cameras, Bothell, Pepper Spray, Robberyburglary, Washington

కౌంటీలోని రాబరీ అండ్ బర్గ్‌లరీ యూనిట్ (ఆర్‌బీయూ) గత రెండు వారాలుగా నివాస గృహాల్లో చోరీలు పెరిగినట్లు నివేదించింది.ప్రధానంగా ఇండియన్ అమెరికన్ బాధితులను లక్ష్యంగా చేసుకుని ఇవి చోటు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.దొంగతనాలు పగటిపూట జరుగుతున్నట్లు ఆర్‌బీయూ నిర్ధారించింది.

చోరీలు జరిగిన ప్రాంతంలోని వ్యక్తులు ఈ అనుమానితులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లేదా ఫోటోలు తమతో పంచుకోవాలని కోరుతున్నారు.తాము ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చాలా సురక్షితంగా వుందని, కానీ ప్రస్తుతం అలా అనిపించడం లేదని ఓ స్థానికురాలు అన్నారు.

మా ఇంట్లో ఓ కుక్క వుందని, కానీ మరో కుక్కను తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Telugu America, Cctv Cameras, Bothell, Pepper Spray, Robberyburglary, Washington

ఆమె భర్త మీడియాతో మాట్లాడుతూ.ఇంటి భద్రతకు సంబంధించి పెప్పర్ స్ప్రే, సీసీ కెమెరాలు వంటి వాటి కోసం వేల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.ఇక్కడ నివసిస్తున్న భారతీయులకు అమెరికా పౌరసత్వం లేకపోవడంతో చట్టబద్ధంగా ఆయుధాలను కలిగి వుండటానికి వీల్లేదు.

ఇదే వారిని దొంగలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం కావొచ్చు.బుధవారం స్నో హోమిష్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కాన్యన్ క్రీక్ ప్రాంతంలోని ప్రజల ఇళ్లలోకి చొరబడిన అనుమానితుల ఫోటోలను విడుదల చేసింది.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని, విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని అన్ని కిటీకీలు, స్లైడింగ్ డోర్లు, యాక్సెస్ పాయింట్లు లాక్ చేసుకుని వుండేలా చూసుకోవాలి పోలీసులు, డిటెక్టివ్‌లు, కౌంటీ షెరీఫ్ కార్యాలయం నివేదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube