బీజేపీ నేత మురళీధర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశానని పేర్కొన్నారు.
అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మురళీధర్ తెలిపారు.
చాలా మంది జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆయన పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదనుకుంటున్నట్లు తెలిపారు.