అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిన్న తీర్పును రిజర్వ్ చేసింది.అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ ఎక్కడా ఉల్లంఘించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.వాదనలు పరిశీలించిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.







