దివంగత నేత పివి నరసింహారావు 19వ వర్ధంతి: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

హైదరాబాద్:డిసెంబర్ 23పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి( ​CM Revanth Reddy ) పేర్కొన్నారు.పీవీ 19 వ వ‌ర్ధంతి( PV Narasimha Rao ) సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళు ల‌ర్పించారు.

 Late Leader Pv Narasimha Rao's 19th Death Anniversary: Cm Revanth Reddy Pays-TeluguStop.com

అనంతరం ఆయ‌న మాట్లాడుతూ భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొ చ్చిన వ్యక్తి పీవీ అని సీఎం వ్యాఖ్యానించారు .

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమ‌ని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌ల‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని పేర్కొన్నారు.

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube