తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ స్వేదపత్రంను విడుదల చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరుతో రేపు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్వేతపత్రంకు కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదలకు సిద్ధమైంది.తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తుందని ఆరోపించిన బీఆర్ఎస్ తమ పాలనలో అప్పులు కాదు ఆస్తులు కూడా సృష్టించామని స్వేదపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు.