సాధారణంగా కుక్కలు( Dogs ) బైకులు, స్కూటర్లు, కార్ల వెంట పడుతుంటాయి.వీటివల్ల బైకర్స్ చాలా భయపడిపోతుంటారు.
అవి ఎక్కడ కరుస్తాయేమో అని ఫాస్ట్ గా వెళుతుంటారు.గజిబిజిగా డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కూడా గురవుతుంటారు.
తాజాగా చండీగఢ్‌లోని( Chandigarh ) సెక్టార్ 38లో స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, ఆమె కుమార్తెను వీధి కుక్కలు తరిమాయి.స్కూటర్‌ను వీధికుక్కలు వెంబడించడం చూసి కుమార్తె చాలా భయపడి పోయింది.
తల్లి కూడా అవి కరుస్తాయేమో అని భయంగా స్కూటర్ ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది.ఎటు వెళ్తున్నాం అనేది కూడా ఆమె చూసుకోలేదు.

చివరికి సదరు తల్లి ద్విచక్ర వాహనాన్ని సమీపంలోని ఇంట్లోకి తోలింది, అక్కడ ఆగి ఉన్న సైకిళ్లను స్కూటర్ తో( Scooter ) కాస్త వేగంగానే ఢీ కొట్టింది, ఫలితంగా ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి ఆ ఇంటి ముందు పడిపోయారు.అయితే ఆ శబ్దానికి భయపడిపోయిన కుక్కలు ఈ తల్లి కూతుర్లపై దాడి చేయకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి.దాంతో తల్లి ఊపిరి పీల్చుకుంది.తన కుమార్తెకు ఏమైనా గాయాలు అయ్యాయో ఏమో అని చెక్ చేసుకుంది.

గగన్‌దీప్ సింగ్( Gagandeep Singh ) లోకల్ జర్నలిస్టు కుక్కల వల్ల ఆ తల్లి కూతుర్లు ఎలా ప్రమాదానికి గురయ్యారో చూపించే వీడియోను ఎక్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు.ఆ వీడియో ఓపెన్ చేసి ఏం జరిగిందో మీరు చూడవచ్చు.దాని ప్రకారం, ఖాళీగా ఉన్న ఒక వీధిలో మూడు వీధి కుక్కలు స్కూటర్‌ను ఛేజ్ మనం చూడవచ్చు.తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







