ఓపెనింగ్ కాకుండానే శిథిలావస్థకు చేరిన బస్టాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల కేంద్రంలో పదిహేను ఏళ్ళ క్రితం ఆనాటి ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ హయాంలో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నేటికీ ప్రారంభానికి నోచుకోక పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరిన వైనం గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Aleru Constituency Gundala Bus Stand Construction Still Not Completed, Bus Stan-TeluguStop.com

ప్రజల రవాణా సౌకర్యం కోసం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బస్టాండ్ నిర్మాణం చేశారు.

కానీ,బస్టాండ్ ఎంట్రెన్స్ భాగంలో తీగలు ఉన్నాయన్న నేపంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు.వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్ లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య గుండాల బస్టాండ్ కు మరమ్మతులు చేపట్టి త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube