ఓపెనింగ్ కాకుండానే శిథిలావస్థకు చేరిన బస్టాండ్
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల కేంద్రంలో పదిహేను ఏళ్ళ క్రితం ఆనాటి ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ హయాంలో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నేటికీ ప్రారంభానికి నోచుకోక పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరిన వైనం గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల రవాణా సౌకర్యం కోసం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బస్టాండ్ నిర్మాణం చేశారు.
కానీ,బస్టాండ్ ఎంట్రెన్స్ భాగంలో తీగలు ఉన్నాయన్న నేపంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్ లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య గుండాల బస్టాండ్ కు మరమ్మతులు చేపట్టి త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.