తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పోరేటర్లతో( GHMC BRS Corporators ) కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలలో గులాబీ జెండా ఎగిరేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవడానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ( BRS ) చాలా పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నిరాశ పడవద్దు అని అన్నారు.అడ్డగోలు హామీలతో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొద్దామని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగిరేలా కలసికట్టుగా అందరం పనిచేద్దామని కేటీఆర్ ( KTR ) నేతలకు తెలియజేయడం జరిగింది.దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.కొన్ని వారాల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది.కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ లోనే( Hyderabad ) బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది.
దీంతో వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న పార్టీ కార్పొరేటర్లకు తెలియజేశారు.







