Prabhas : కథల ఎంపికలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా.. ఒకదానితో మరొకటి సంబంధమే ఉండదు

ప్రభాస్( Prabhas ) సలార్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైపోయాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 Prabhas Movies Linup-TeluguStop.com

అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు.దానికి మొదటి నుంచి ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అనేకం ఉన్నాయి.

ముఖ్యంగా కథల ఎంపికలో ఆచితూచి అడుగు వేయడంతోనే ఈరోజు ఈ విజయం అతనికి దక్కింది అని అనుకోవచ్చు.గత కొన్నేళ్లు వెనక్కి వెళితే ప్రభాస్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu Salaar, Baahubali, Chatrapathi, Prabhas, Saaho, Tollywood, Varsham-Movie

వర్షం సినిమా ప్రభాస్ కెరియర్ లోనే అతడికి మొట్టమొదటి భారీ హీట్ ని అందించింది అంతకన్నా ముందు ఈశ్వర్, రాఘవేంద్ర వంటి మంచి సినిమాలు ఉన్నప్పటికీ వర్షం ఒక బ్లాక్ బాస్టర్ హీట్ ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈశ్వర్ సినిమా ఒక బస్తీలో సాగే కథ అలాగే మాస్ హీరోగా ప్రభాస్ ని గుర్తించేలా చేసింది.ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా అతనిలోని భక్తి కోణాన్ని కూడా చూపించి హిట్టు వచ్చేలా చేసింది.ఇక వర్షం సినిమా గురించి చెప్పేది ఏముంది అది ఒక సూపర్ కమర్షియల్ ఫార్ములా.

వర్షం హిట్ రాగానే అడవి రాముడు వంటి ఒక భిన్నమైన సినిమాతో కూడా తెరపైకి వచ్చాడు.ఇది పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ ఈ చిత్రం తర్వాత చక్రం అనే మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Telugu Salaar, Baahubali, Chatrapathi, Prabhas, Saaho, Tollywood, Varsham-Movie

చక్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసిన ఆ తర్వాత చత్రపతి( Chatrapathi ) లాంటి ఒక అద్భుతమైన చిత్రం ప్రభాస్ ఖాతాలో పడింది.ఇచ్చిన తర్వాత పౌర్ణమి సినిమా తీసిన అది కూడా ప్రభాస్ కి మంచి పేరును తీసుకొచ్చింది అలాగే దీని కథకు అంతకుముందు తీసిన కథలతో ఎలాంటి సంబంధం లేకుండా తీయడం విశేషం.అక్కడి నుంచి మొదలు నిన్న మొన్నటి ఆది పురుష్ వరకు అన్ని కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే ఉంటాయి. బాహుబలి, సాహో, రాదే శ్యామ్ ఇలా అన్ని చిత్రమైన విచిత్రమైన కథలను ఎంచుకుంటూ తన కెరియర్ ను ముందు తీసుకెళ్తున్నాడు ప్రభాస్.

ఇప్పుడు ఇక సలార్( Salaar ) మరో రేంజ్ సినిమా అని అందరూ అంటున్నారు.ఇలా సంబంధమే లేని కథలతో సంబంధం లేని సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నిజంగా గొప్ప విషయమే కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube