సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga )… ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో పేరున క్రేజీ డైరెక్టర్లలో సందీప్ కూడా ఒకడు.అయితే తీసినవి మాత్రం కేవలం మూడు సినిమాలే అయినా కూడా ఎక్కడ లేని క్రేజ్ ఆయనకు సొంతమైంది.
అందుకు గల కారణం సినిమా మేకింగ్ స్టైల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఏ విషయాలైనా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ ప్రతి విషయాన్ని వాయిలేన్స్ తో చెప్పడం లేదా బోల్డ్ గా చూపించడం కేవలం సందీప్ రెడ్డి కే చెల్లింది.
ప్రస్తుతం ఆర్జీవీ తర్వాత సందీప్ మాత్రమే అలాంటి ఒక గట్స్ ఉన్న డైరెక్టర్ అందరూ భావిస్తున్నారు.అయితే సందీప్ ఇటీవల తీసిన ఆనిమల్ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఆ ఊపులోనే తరువాత తాను తీయబోయే మూడు సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లీక్ అయింది.దానికి సంబంధించిన చర్చ బాగా సాగుతోంది.
మరి సందీప్ రెడ్డి వంగా తీయబోతున్న ఆ మూడు సినిమాలు ఏంటి? అందులో నటిస్తున్న హీరోలు ఎవరు అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

రణభీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా( Animal movie ) తీసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా చేయబోతున్న చిత్రం స్పిరిట్.ఈ చిత్రానికి ఇప్పటికే ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే.స్పిరిట్ కథ గత రెండేళ్ల క్రితమే ప్రభాస్ కి సందీప్ నరేషన్ ఇవ్వగా దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది.
అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళేది ఈ సినిమా అనే వార్తలు ప్రస్తుతం జోరందుకున్నాయి.

ప్రభాస్ తో స్పిరిట్ పూర్తి చేసిన తర్వాత రణబీర్ కపూర్( Ranbir Kapoor ) తోనే మరొక సినిమా కూడా చేయనున్నాడు సందీప్.దానికి అనిమల్ పార్క్ అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.వీరి కాంబినేషన్ లో ఆనిమల్ ఇంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కి సైతం ఒక కథ చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తోంది.పుష్ప సినిమా సీక్వెల్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ మరొకటి లేదా రెండు వేరే డైరెక్టర్ల సినిమాలు చేయనుండగా అవి పూర్తయిన తర్వాతే సందీప్ రెడ్డి వంగా కి టైం ఇస్తాడు అని తెలుస్తుంది.
ఇలా మూడు వరుస క్రేజీ ప్రాజెక్టులు ఒప్పుకొని వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసే పనిలో ఉన్నాడు సందీప్.







