‘‘ఖైకే పాన్ బనారస్ వాలా, ఖులీ జాయే బ్యాండ్ అకల్ కా తాలా’’ అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సాంగ్ చాలా ఓల్డ్ అయినప్పటికీ ఇప్పటికీ దీన్ని వింటూ ఎంజాయ్ చేసే ఈ తరం ప్రేక్షకులు కూడా ఉన్నారు.
ఈ పాటలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్( Megastar Amitabh ) బచ్చన్ కిళ్లీ నమలుతూ కనిపిస్తాడు.అప్పట్లో ఈ సాంగ్ కేవలం హిందీ మాట్లాడే ప్రాంతాల్లోనే కాకుండా ఇండియా వైడ్‌గా ప్రజలను ఉర్రూతలూగింది.
ఈ పాట 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన డాన్( don ) సినిమాలోనిది.ఈ యాక్షన్ కిల్లర్ మూవీని తెలుగులో ఎన్టీఆర్ హీరోగా యుగంధర్( Yugandhar ) (1979) పేరుతో తెరకెక్కించారు.1980లో రజనీకాంత్ కథానాయకుడిగా తమిళంలో, 1986లో మోహన్ లాల్ హీరోగా మళయాళంలో రీమేక్ కూడా చేశారు.ఈ సినిమా కథ బాగుండటం, హీరోలుగా ఎన్టీఆర్, రజినీకాంత్ మోహన్ లాల్ అద్భుతంగా నటించడం వల్ల సౌత్ ఇండియాలో కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.
మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన కళ్యాణ్ జీ, ఆనంద్ జీ డ్యుయో( Kalyan ji , Anand ji duo ) ఈ మూవీకి సంగీత బాణీలు సమకూర్చారు.ఖైకే పాన్ బనారస్ వాలా పాటను ప్రముఖ సింగర్ కిషోర్ కుమార్ పాడాడు.
నిజానికి మొదట డైరెక్టర్ అనుకున్నట్లు సినిమాలో ఈ పాట లేదు.కానీ షూటింగ్ అయిపోయాక దీనిని మధ్యలో ఇరికించారు.
మొదట రాసుకున్న స్క్రీన్ ప్లేలో కూడా ఈ సాంగ్ లేకపోవడం గమనార్హం.

ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందని, చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా మూవీ మొత్తం చూడాల్సి వస్తుందని దీన్ని మొదటగా చూసిన కొందరు తమ రివ్యూ ఇచ్చారు.దాంతో సినిమా స్లో చేయాలని భావించి ఒక పాట పెట్టాలని సంగీత దర్శకులకు డైరెక్టర్ చెప్పాడు.అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అంతకుమునుపు ఒక సినిమా కోసం ఒక ట్యూన్ కట్టి, దాన్ని అప్పటిదాకా యూజ్ చేయలేదు.
అదే ట్యూన్‌ను డాన్ మూవీ డైరెక్టర్ చంద్ర బారోట్‌కు( Director Chandra Barot ) వినిపించారు.అది డైరెక్టర్ కి తెగ నచ్చేసింది.వెంటనే లిరిసిస్ట్ ను పిలవడంతో అతను ఆ ట్యూన్ కి తగిన పాట రాసేశారు.

అందరూ ఈ పాటకు, ట్యూన్‌కు ఓకే చెప్పినా సింగర్ కిషోర్ కుమార్ ( Singer Kishore Kumar )మాత్రం అసలు ఇది హిందీ పాటేనా? అని పెదవి విరిచాడు.అయితే ఖైకే అనే పదం హిందీ పదం కాకపోయినా ఉత్తర ప్రదేశ్ లో బాగా వాడుతుంటారు, అమితాబ్ బచ్చన్ ఉత్తర ప్రదేశ్ వాడు కాబట్టి ఆయన కోసం ఈ పదం వాడటంలో పెద్ద తప్పేం లేదని ఇతరులు సర్ది చెప్పారు దాంతో ఆ పాటను కిషోర్ కుమార్ పాడాడు.రికార్డింగ్ స్టూడియోలో పాట పాడే సమయంలో కిళ్లీలు, ఉమ్ము వేసుకునే తొట్టి ఏర్పాటు కూడా చేశారు అవి తింటూ మధ్య మధ్యలో ఉమ్మి వేస్తూ ఈ పాటను కిషోర్ కుమార్ అద్భుతంగా పాడాడు.
అక్క వీడియో షూటింగ్ సమయంలో నాలుక ఎర్రగా కనిపించాలని అమితాబ్ బచ్చన్ కూడా చాలా కిల్లిలు నమిలేశాడు.







