తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నటుడు శివాజీ( Shivaji ) ఇటీవల బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శివాజీ టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఇక హౌస్ నుంచి బయటకు రావడంతో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే తన సినీ కెరీర్ గురించి పలు విషయాలను వెల్లడిస్తున్నారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ముందు ఎడిటింగ్ రూమ్లో పని చేశారని తెలుస్తోంది.కేఎస్ రామారావు గారు స్టూడియో( KS Rama Rao studio ) పెట్టిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి ఈయన ఎడిటర్ గా పని చేశారని తెలుస్తోంది.అప్పట్లో కె ఎస్ రామారావు గారిని కలవాలి అంటే ఆయనకు ఏదైనా కథ చెప్పాలి అని చెబితేనే తనని కలిసే అవకాశం ఉంటుంది.
లేకపోతే ఎవరిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వరు.ఈ విషయాన్ని నాకు ఒక డైరెక్టర్ చెప్పడంతో నేను కూడా సార్ కి ఒక కథ చెప్పాలి అని చెప్పి తన అపాయింట్మెంట్ తీసుకున్నానని శివాజీ తెలిపారు.

ఇలా కేఎస్ రామారావు( KS Ramarao ) అపాయింట్మెంట్ తీసుకుని ఆయన వద్దకు వెళ్ళగానే ఏం కథ అని నన్ను అడిగారు దాంతో నన్ను క్షమించండి నేను అబద్ధం చెప్పాను నాకు కథలు చెప్పడం రాదు.నాకు ఎడిటింగ్ మాత్రమే వచ్చు నేను ఎడిటర్ గా పని చేస్తాను సార్ అంటూ అసలు విషయం తనకు చెప్పాను దాంతో భలేవాడివయ్యా నువ్వు అంటూ ఆయన నాతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత జీతం ఎంత కావాలి అని అడిగారు.అందుకు నేను మూడు పూటలా అన్నం పెట్టి కాస్త బట్టలు కొనడానికి డబ్బు ఇవ్వండి సార్ అని చెప్పాను వెంటనే క్యాషియర్ ని పిలిపించి నాకు ఎనిమిది వందల రూపాయల డబ్బులు ఇచ్చారని అదే నా ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటూ ఈ సందర్భంగా శివాజీ తెలిపారు.ఎడిటర్ (Editor) గా మొదలైన నా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది అంటూ ఈయన వెల్లడించారు.







