హరీష్ శంకర్( Harish shankar ) డైరెక్షన్ లో రవితేజ( Ravi Teja ) హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా హిందీలో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన రైడ్ సినిమాకి రీమేక్ తెరకెక్కబోతుందనే వార్తలయితే వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉంది అనేది క్లారిటీగా తెలియనప్పటికీ ముఖ్యంగా హరీష్ శంకర్ అంటే రీమేక్ సినిమాలను ఎక్కువగా చేస్తాడనే టాక్ అయితే జనాల్లో ఎక్కువగా ఉంది.
ఇక ఆయన రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడంటూ మరి కొంతమంది కూడా చాలా రకాల కామెంట్లు చేస్తుంటారు.

ఇక ఇప్పటికే ఆయన గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు ఇక రవితేజతో ఇప్పుడు మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) గా చేస్తున్న ఈ సినిమా కూడా హిందీ లో వచ్చిన రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుందనే విషయం అయితే తెలుస్తుంది.ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే అజయ్ దేవగన్ ఈ సినిమాకు బెస్ట్ విషెస్ ని చెప్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు ఇక దాంతో ఇది ఆయన సినిమానే రీమేక్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు వస్తున్నాయి…అయితే మరి కొంతమంది మాత్రం హరీష్ శంకర్ పైన ఈ విషయంలో తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.మన తెలుగు డైరెక్టర్లు చాలామంది స్ట్రయిట్ సినిమాలు చేసి సక్సెస్ లు కొడుతుంటే హరీష్ శంకర్ మాత్రం ప్రతిసారి రీమేక్ సినిమాలను ఎందుకు నమ్ముకోవడం అంటూ విపరీతంగా హరీష్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్తున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ స్టోరీలని రీమేక్ చేయడం ఏంటి అంటూ తనదైన రీతిలో స్పందిస్తున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మంచి కథలు వస్తున్నాయి.
మన స్టోరీలనే బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేయాలని చూస్తున్న క్రమంలో హరీష్ శంకర్ లాంటి ఒక కమర్షియల్ డైరెక్టర్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవం తగ్గిపోతుంది అంటూ మరి కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు…
.







